బుల్లితెరపై నవ్వులు పండించిన జబర్ధస్త్ కమేడియన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’తో ధన్‌రాజ్ వెలుగులోకి వచ్చాడు. జబర్ధస్త్ లో టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అంచలంచెలుగా ఎదుగుతూ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆపై సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయాడు. ధన్ రాజ్ మేనరీజం అందరినీ ఆకట్టుకుంటుంది.
తెలుగు లో వస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 లో ధన్ రాజ్ ఇంటి సభ్యుడిగా అందరి మనసు గెలుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో 41 రోజుల పాటు కొనసాగారు. అప్పటి సీజన్‌లో పదో స్థానంలో నిలిచారు. జబర్ధస్త్ ను వీడిన తర్వాత జీ తెలుగులో అదిరింది పేరుతో నిర్వహించిన కామెడీ షోలో నవ్వులు పూయించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉంటున్న ధన్ రాజ్.. ఆ మద్య తమిళ్ మూవీలో కూడా నటించాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో తన కామెడీతో అందరి మనసు దోచాడు ధన్ రాజ్.
ధన్‌రాజ్.. కరేబియన్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను కలిశాడు. అంతేకాదు కాసేపు ముచ్చటించి ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘హే.. క్రిస్ గేల్ ఇక్కడ’ అంటూ కొన్ని స్మైలీ ఎమోజీలను కూడా పోస్ట్ చేశాడు. ఫొటోలో బ్లూ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్, క్యాప్ పెట్టుకుని క్రిస్ గేల్ ఉండగా.. బ్లూ షర్ట్ వేసుకుని ధన్‌రాజ్ స్మైల్ ఇస్తున్నాడు. వాషింగ్టన్ డీసీ కనెక్టికట్‌లో ఉన్న మేఫ్లవర్ హోటల్ లాంజ్‌లో గేల్‌ను టాలీవుడ్ కమెడియన్ కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటో పోస్ట్ చేసిన వెంటనే పలువురు నెటిజన్లు స్పందించారు. ఎక్కడ కలిశావు బ్రో అంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తోన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Yeeeeey(; 🤩🤩🤩🤩🤩@henrygayle here 👇🏽 pic.twitter.com/MsRdUPFTab
— Dhanraj (@DhanrajOffl) July 1, 2022