ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్‌లో లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది.
ఇది చదవండి: Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం!
ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడిగా నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి నేను ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లోనే నటించాను. అందువల్ల చాలామంది నేను ఢిల్లీ అబ్బాయిననే విషయాన్ని మర్చిపోయారు. అయితే తాను హిందీ చాలా అద్భుతంగా మాట్లాడుతానని.. హిందీ చిత్రాల్లో నటిస్తుండటం ఒక అలవాటుగా మారిందని అన్నారు. ఇటీవల తనకు ‘ఎస్కేప్ లైవ్’ కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిపారు.
ఇది చదవండి: Shrihan: సిరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.. శ్రీహాన్ ఎమోషనల్ వీడియో!
తనకు నచ్చిన పాత్రలు వచ్చినంత వరకు సినిమాల్లో నటిస్తానని, అలాంటి అవకాశాలు రానప్పుడు తప్పకుండా నటనకు స్వస్తి పలికి వేరే ఉద్యోగం వెతుక్కుంటా అని సిద్దార్థ్ పేర్కొన్నారు. ఇక సిద్దార్థ్ నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్ తన కెరీర్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.