టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన ‘హైదరాబాద్ టైమ్స్’ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ – మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో కూడిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్’ లిస్టును ప్రకటించింది. గ్లామర్ హీరోయిన్ శృతిహాసన్ మూడు పదుల వయసులో మరోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను గెలుచుకొన్నారు. గతంలో 2013లో తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకొన్న శృతి మళ్లీ 7 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. 2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి గతేడాది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది మోస్ట్ డిజైరబుల్ వుమన్ గా నిలిచింది. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీననిచ్చి శృతి హాసన్ ఈ టైటిల్ ను సొంతం చేసుకోవడం విశేషం.మహిళలు 30 ఏళ్ల వయసులో మరింత సెక్సీగా ఉంటారంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల వయసులో అమ్మాయిలు చాలా సెక్సీగా ఉంటారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారు మరింత సెక్సీగా ఉంటారు. వారిలో పూర్తిగా ఓ రకమైన అందం, ఆకర్షణ కనిపిస్తుంది అని శృతిహాసన్ తెలిపారు. ఈ మధ్య సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ ఇటీవల ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ సినిమాలతో పలకరించింది. అక్కినేని సమంత ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ జాబితాలో రెండో స్థానంలో ఉంది. గతేడాది 5వ స్థానంలో ఉన్న బుట్టబొమ్మ పూజాహెగ్డే ఈసారి మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2020 జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. గతేడాది 7వ ప్లేస్ లో ఉంది. తెలుగులో ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రకుల్ నిరూపించింది.లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ లిస్టులో 5వ స్థానంలో నిలిచింది.