సీనియర్ నటి వై. విజయ గురించి రెండు దశాబ్దాల క్రితం వారికి పరిచయం అక్కర్లేని పేరు. అత్తగా, అమ్మగా, గయ్యాలి అక్కగానో .. ఇలా అనే విభిన్నమైన పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు సరసన కథానాయికగా నటించారు. తెలుగు , తమిళ భాషల్లో ఇప్పటి వరకు దాదాపు 1000 కి పైగా చిత్రాలలో నటించారు. చాలా కాలం వరకు తెలుగు తెరకు దూరమయ్యారు. 'F2' మూవీ తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన 'F3' మూవీలో కూడ తనదైన నటనతో కామెడీ పండించారు. ఇండస్ట్రీని ఎవరైన చిన్న చూపు చూస్తే అసలు సహించనని వై.విజయ అన్నారు. తను 9నెల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా షూటింగ్ లకి వెళ్లేదానని తెలిపారు. ఆమె తాజాగా సుమన్ టీవీ కి ఇచ్చిన ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. మీరూ ఆ వీడియోను వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.