సీటిమార్ మూవీ రివ్యూ..

గోపీచంద్.. పక్కా కమర్షియల్ హీరో. మాస్ చేత విజిల్స్ వేపించగల సరైన కటౌట్ ఉన్న స్టార్. సరైన కథ పడితే ఈ మ్యాచో మేన్ సత్తా చూపించడం ఖాయం. అయితే.. గోపీచంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఈ నేపథ్యంలో సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన “సీటిమార్” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

ఆత్రేయపురం అనే గ్రామంలో.. అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తుంటాడు కార్తీక్ (గోపీచంద్). తన తండ్రి మంచి ఆశయంతో కట్టించిన స్కూల్ ని కాపాడుకోవడానికి..ఆంధ్ర మహిళల జట్టుకి కబడ్డీ కోచ్ గా మారతాడు. తాను కష్టపడి తాయారు చేసుకున్న టీమ్ తో ఢిల్లీలో అడుగుపెట్టిన కార్తీక్ కి.. అక్కడ అనుకోని పరిస్థితితులు ఎదురవవుతాయి. అక్కడ పోలీస్ ఆఫీసర్ అయిన తన బావని కాపాడుకునే ప్రయత్నంలో ముక్తాల్ తమ్ముడిని చంపేస్తాడు కార్తీక్. తరువాత ఆ గ్యాంగ్ నుండి తన టీమ్ ని కాపాడుకుంటూ.., కార్తీక్ తన ఆశయాన్ని ఎలా బతికించుకున్నాడు? ఈ ప్రయాణంలో జ్వాలా రెడ్డి (తమన్నా) కార్తీక్ కి ఎలా అండగా నిలిచింది అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ:

సీటిమార్ సినిమాలో లో చాలా కథలు ఉన్నాయి ఒక ఊరి కథ ఉంది. ఒక స్కూల్ కథ ఉంది. అక్కా, తమ్ముడి కథ ఉంది. ఓ స్పోర్ట్స్ డ్రామా ఉంది. కానీ.., వీటిలో ఏ ఒక్క దాన్ని బలంగా చెప్పకుండా, అన్నిటినీ అలా టచ్ చేసుకుంటూ పోయాడు దర్శకుడు సంపత్ నంది. హీరో, అతని టీమ్ ఇంత పోరాటం చేసేదే ఆ స్కూల్ మూతపడకుండా ఉండటానికి. కానీ..,ఆ స్కూల్ తో హీరోకి ఉన్న బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశం సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇదే.. సగటు ప్రేక్షకుడిని కథలోకి ఇన్వాల్వ్ కాకుండా చేసింది.

కమర్షియల్ గా మాత్రం దర్శకుడు సంపత్ నంది తన మార్క్ చూపించాడు. కొన్ని డైలాగ్స్.. ధియేటర్ లో బాగా పేలాయి కూడా. యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి. ఇక కార్తీక్ పాత్రలో గోపీచంద్ ఒదిగిపోయాడు. ఈ విషయంలో గోపీచంద్ పడ్డ కష్టాన్ని తక్కువ చేయలేము. ఇక కథతో పెద్దగా సంబధం లేకపోయినా.., తమన్నా చేసిన జ్వాలా రెడ్డి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోసాని తన యాక్టింగ్ తో ప్రీ క్లైమ్యాక్స్ ని నిలబెట్టారు. భూమిక కూడా తన పాత్ర పరిధి మేర బాగానే నటించింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. అయితే.. పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. మిగతా టెక్నీకల్ విషయాలు గాని, నిర్మాణ విలువలు గాని చాలా బాగున్నాయి. కాకుంటే.. తీస్తుంది కమర్షియల్ సినిమా కాబట్టి.. లాజిక్స్ అవసరం లేదనుకున్నాడో ఏమో గాని.., సంపత్ నంది సినిమాటిక్ లిబరిటి ఎక్కువ తీసుకున్నాడు. లాజిక్స్ అంతగా పట్టించుకోకపోతే సీటిమార్ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

గోపీచంద్

యాక్షన్ సీక్వెన్స్ లు

సంపత్ నంది డైలాగులు

తమన్నా గ్లామర్

మైనస్ పాయింట్స్ :

ఎమోషన్స్ మిస్ అవ్వడం

లాజిక్స్ మిస్ అవ్వడం

కథా, కథనం నెమ్మదించడం

చివరి మాట: ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా.. కమర్షియల్ మూవీని ఎంజాయ్ చేయగలిగే వారికి సీటిమార్ తప్పకుండా నచ్చుతుంది.

రేటింగ్ : 2.5