కొత్త లైఫ్‌కు వెల్‌కమ్‌ చెప్పనున్న సమంత

samantha nagachaithanya tollywood

ఏం మాయ చేసావె సినిమాలో కలిసి నటించి.. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోనే మోస్ట్‌ బ్యూటీఫుల్‌, లవ్‌బుల్‌ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య-సమంత. ఏమైందో ఏమో తెలియదు కానీ విడిపోతున్నట్లు ప్రకటించి షాక్‌కు గురిచేశారు. అంతకుముందు నుంచే వారు విడిపోతున్నట్లు పుకార్లు, వార్తలు వచ్చాయి వాటిని అక్టోబర్‌ 2న నిజం చేస్తూ ఇద్దరూ సోషల్‌ మీడియాలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. చైతూ-సామ్‌ ఇద్దరూ నాకు ఇష్టమైన వారే. దంపతుల మధ్య విషయాలు వారి వ్యక్తిగతం. ఇద్దరూ బాగుండాలంటూ సోషల్‌ మీడియాలో తెలిపారు. నాగ్‌ భార్య అమల కూడా అదే ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ చేతులు జోడించే ఎమోజీ పెట్టారు. ఈ వార్త అటూ సినీ వర్గాలలోనూ, ఇటు అభిమానులను కుదిపేసింది. చూడముచ్చటగా ఉండే జంట ఇలా విడిపోతుండడం చాలా బాధగా ఉందంటూ కోట్ల మంది సోషల్‌ మీడియాలో స్పందించారు.

samantha nagachaithanya tollywood

చాలా చర్చలు, ఆలోచనల తర్వాత ఇద్దరం విడిపోదాం అని నిర్ణయించుకున్నట్లు, మమ్మల్ని అర్థం చేసుకుని, తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని చైతూ-సామ్‌ సోషల్‌ మీడియా వేదికగా కోరుకున్నారు. అనంతరం రెండు రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఇద్దరూ.. సోమవారం సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు మళ్లీ వైరల్‌ అయ్యాయి. నాగచైతన్య సాయిధరమ్‌ తేజ్‌ కోలుకోవడం తనకు ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే సమంత కూడా ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు. బద్దకం వదిలి ముందుకు నడవాలి’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది.

samantha nagachaithanya tollywood

దీన్ని బట్టి నాగచైతన్యతో బంధం తెగిన తర్వాత తాను ఒక కొత్త జీవితం ప్రారంభించాలని బలంగా కోరుకున్నట్లు తెలుస్తుంది. ఒంటరిగా తన లక్ష్యాలను సాధించేందకు మానసికంగా సిద్ధం అవుతున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే సమంత చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటికి తోడు ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు. ఈ మధ్య చేసిన ఫ్యామిలీ మెన్‌2తో సమంతకు బాలీవుడ్‌ అవకాశాలు కూడా వెతుకుంటూ వస్తున్నాయి. సామ్‌ ఓకే చెప్తే రెమ్యూనరేషన్‌ ఎంతైనా ఇచ్చేందుకు బడా బడా నిర్మాతలు రెడీగా ఉన్నారు. వైవాహిక జీవితంలో కొనసాగడం, ముగింపు పలకడం వారివారి వ్యక్తిగత విషయమని, ఇలాంటి సమయంలో వారు ఎంచుకున్న దారిలో విజయం సాధించాలని సమంత అభిమానులు సోషల్‌ మీడియాలో కోరుకుంటున్నారు.