సామ్-చైతు విడాకులు.. ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నానంటూ సమంత క్లారిటీ!

samantha sad

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ గా పేరుతెచ్చుకున్న సమంత-నాగచైతన్య ఎట్టకేలకు విడాకులు తీసుకుంటున్నామంటూ అధికారికంగా తెలిపారు దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ అంతా షాక్ లో మునిగిపోయారు. ఇక వీరి విడాకుల అంశంపై నాగార్జున నుంచి ఇటు సినీ ఆర్టిస్టుల వరకు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే గతంలో సమంత హైదరాబాద్ ను వీడి ముంబై చెక్కేస్తుందంటూ వార్తలు వినిపించాయి.

samantha sadఇక దీనిపై ఇప్పటికే స్పందించిన సమంత హైదరాబాద్ విడిచి వెళ్లేది లేదంటూ కుండబద్దలు కొట్టింది. ఇక విడాకుల తర్వాత కూడా సమంత హైదరాబాద్ కాకుండా మరో ప్రాంతానికి వెళ్లనుందని మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై తాజాగా స్పందించిన సమంత హైదరాబాద్ ను విడిచి వెళ్లనని ఇప్పటికీ.. ఎప్పటికీ ఇక్కడే ఉంటానంటూ సమంత మరోసారి క్లారిటీ ఇచ్చింది. కాగా హైదారాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్ కు త్వరలో షిష్ట్ కానుందని తెలుస్తోంది.