చైతూ-సామ్ పిట్ట సందేశాలు.. ఫ్యాన్స్ ఖుష్!

గత కొంత కాలంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తున్న విషయం ఏంటంటే.. నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకోబోతున్నారు.. ఈ ఇద్దరూ విడిపోతోన్నారని, ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ కూడా విడిపోతోన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.

aags minఅందుకు తగ్గట్టుగానే ఇటీవల సమంత తన ఇంటి పేరు ‘అక్కినేని’ తీసేసి ‘సమంతరుతుప్రభు’ అని తన తండ్రిపేరు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని విడిపోయారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సమంత-నాగచైతన్య వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. సమంత ప్రస్తుతం గోవా టూర్ ముగించి చెన్నైలో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. చైతూ కూడా ఒంటరిగానే ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఈ గాసిప్స్ పై సమంత, నాగ చైతన్య వారి కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ సాగుతోంది.

lovestory minఇదిలా ఉంటే.. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకోవడంతో చైతన్య చేసిన ట్వీట్ ను సమంత రీట్వీట్ చేసింది. నాగచైతన్యకు ‘ఆల్ ది బెస్ట్ చెబుతూ’ సమంత ట్వీట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా తన చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత చేసిన ట్వీట్‌ను చైతూ రీట్వీట్ చేస్తూ థ్యాంక్యూ సామ్ అని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ జంట ఇద్దరూ తమ మద్య విభేదాలు లేవని పిట్ట సందేశాలు ఇచ్చుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ కాస్త ఊరట చెందుతున్నారు. ప్ర‌స్తుతం స‌మంత‌, చైతూ త‌మ సినిమా షూటింగుల ప‌నుల్లో బిజీగా గ‌డుపుతున్నారు.