Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు టాలీవుడ్‌తో మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున ఇలా చాలా మందితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చారంటే వారిని కలవకుండా ఉండరు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన తెలుగు స్నేహితులతో పార్టీ చేసుకున్నారు. అదికూడా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి నివాసంలో ఈ పార్టీ జరిగింది. ప్రస్తుతం ఈ నలుగురు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సల్మాన్ ఖాన్, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్.. సల్మాన్ ‘కబీ ఈద్, కబీ దివాలీ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి..విక్రమ్ చిత్ర బృందాన్ని సన్మానించిన సంగతి తెలిసిందే. చిరు విక్రమ్ టీం మొత్తాన్ని తన ఇంటికి పిలిచి అభినందించారు. విక్రమ్ సినిమా అద్భుత విజయం సొంతం చేసుకున్న సందర్బంగా హీరో కమల్ హాసన్ , డైరెక్టర్ కనగరాజ్ ను చిరంజీవి సత్కరించారు. అనంతరం తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సల్మాన్ ఖాన్ కూడా హజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు ట్విట్టర్ లో షేర్ చేసి “నా పాత స్నేహితుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ సినిమా మంచి విజయం సాధించినందుకు గత రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్ హాసన్ తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మా ఇంటికి రావడంతో చాలా సంతోంషంగా ఉంది. ‘విక్రమ్’ మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది” అని పేర్కొన్నారు. మరి, చిరు, సల్మాన్, వెంకీ, జేసీ పవన్‌ల పార్టీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. #SalmanKhan (@BeingSalmanKhan) is visiting all of his close friends while he is in Hyderabad filming for his upcoming movie '#KabhiEidKabhiDiwali'. At another private gathering, Salman ran into Tollywood superstars #Chiranjeevi (@KChiruTweets) and #Venkatesh (@VenkyMama). pic.twitter.com/JJouaQsdNF — Atulkrishan (@iAtulKrishan) June 22, 2022 ఇవి కూడా చదవండి : Pawan Kalyan: ఆప్యాయంగా పలకరించుకున్న పవన్ కళ్యాణ్- మంచు విష్ణు! ఫోటోలు వైరల్!