దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కినపాన్ ఇండియా చిత్రం RRR. ఈ ఏడాది మార్చిలో 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించి.. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం అందరిని అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రపపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ , యాక్టింగ్, ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదనిపించింది. థియేటర్ల లో కాసులు కురిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. థియేటర్లో విడుదలై RRR.. అనేక రికార్డులు సృష్టించింది. అదే విధంగా ఓటీటీలోను కొన్ని రికార్డులు సృష్టిస్తోంది. తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా "ఆర్‌ఆర్‌ఆర్" రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయిందట. అలా తమ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఓటీటీలో కూడా RRR మూవీ రికార్డుల వేట కొనసాగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. RRR is now the most popular Indian film on Netflix around the world Sending the biggest to fans everywhere! pic.twitter.com/WEOw0nb515 — Netflix India (@NetflixIndia) June 23, 2022 ఇదీ చదవండి: Vikrant Rona: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ విడుదల..!