షణ్ముఖ్‌ జశ్వంత్‌తో డేటింగ్‌కు రెడీ: విష్ణుప్రియ

shanmukh vishnupriya bigboss

య్యూటూబ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించిన షణ్ముఖ్‌ జస్వంత్‌ ఇప్పడు బిగ్‌బాస్‌లోనూ అదరగొడుతున్నాడు. ఆట మొదలైనప్పటి నుంచి తన స్టైలలో బాగా ఆడుతున్నాడు. బయట కూడా షణ్ముఖ్‌కు మంచి సపోర్ట్‌ లభిస్తోంది. హౌస్‌లో పరిస్థితి ఎలా ఉన్నాషణ్ముఖ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోతుంది. షో మొదలై వారం రోజులే అయినే షణ్ముఖ్‌ కే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ అంటూ ఆయన అభిమానులు గట్టిగా చెప్తున్నారు. ఇంకా ఆట ప్రారంభంలోనే షణ్ముఖ్‌కు బంపర్‌ ఆఫర్లు వస్తున్నాయి. టైటిల్‌ గెలిస్తే అతనితో ఒక రోజంతా డేటింగ్‌కు సిద్ధమంటూ యాంకర్‌ విష్ణుప్రియ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ మాట్లాడుతూ.. తన షణ్ముఖ్‌ అంటే ఇష్టమని, ఒక వేళ అతను బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిస్తే ఒక రోజంతా వాడితో డేటింగ్‌ చేస్తానని హాట్‌ కామెంట్స్‌ చేసింది.