నాగ చైతన్య కూల్ పర్సన్.. విడాకులపై రాజీవ్ కనకాల సంచలన కామెంట్స్!

సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడపోవడం ఏంటన్న చర్చ నడుస్తుంది. సమంత-నాగ చైతన్య పెళ్లిరోజు(అక్టోబర్‌6) నేపథ్యంలో వీరి ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సమంత-నాగ చైతన్య.. టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు పొందారు. అలాంటి ఈ కపుల్ ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్‌ల అభిమానులు షాక్‌కు గురయ్యారు.

sagam minఈ జంట విడిపోవడంపై కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలో విలన్ గా నటించిన రాజీవ్ కనకాల సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్‌ చానల్‌కు పంచుకున్నారు. ఈ సందర్భంగా సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై స్పందించారు.

చైతూ-సామ్ విడాకులు అనే విషయం వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. ఏది ఏమైనా లవ్ కపుల్ గా గుర్తింపు పొందిన వాళ్లు విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. అంతే కాదు వారిద్దరి మద్య ఏం జరిగిందో అన్న విషయం మనకు తెలియదు.. అందుకే దాని గురించి మాట్లాడటం సరికాదు అన్నారు. కాకపోతే నాగ చైతన్య మాత్రం రియల్ లైఫ్ లో చాలా సున్నితమైన వ్యక్తి.. ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్ లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో కలుపుగోలుగా నవ్విస్తూ సందడి చేసేవాడని అన్నారు.