కొత్త ట్విస్ట్: సమంత- నాగచైతన్య మధ్యలో మరో మహిళ?

సమంత- నాగచైతన్య విడిపోయిన తర్వాత సోషల్‌ మీడియాలో అనేక పుకార్లు, సందేహాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనేక చర్చలు, ఆలోచనల అనంతరం తాము విడిపోతున్నాం అని చై-సామ్‌ హుందాగా ప్రకటన చేశారు తప్పా ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. అసలు విడిపోయేందుకు కారణం కూడా చెప్పలేదు.. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత వ్యవహారం. కానీ అశేష అభిమానలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తులు కనుక వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం జనాల్లో ఉండడం సహజం. దాంతో సోషల్‌ మీడియాలో వాళ్ల గురించి చాలా విషయాలే బయటికివస్తున్నాయి.

అవి వాస్తవాలనే ఆధారలైతే లేవు గానీ, అంతే తేలికగా కొట్టిపారేసే రీతిలో కూడా లేవు. అలాంటి వాటిల్లో మరీ ముఖ్యమైనది ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌, సమంత రిలేషన్‌ గురించి వస్తున్న వార్తలు. వాస్తవానికి ప్రీతమ్‌ సమంతకు అత్యంత సన్నిహితుడు. చైతూ-సామ్‌ విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే.. ప్రీతమ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లో ‘కంగ్రాట్స్‌ స్లట్‌.. హీ ఈజ్‌ యువర్స్‌’ అంటూ పోస్ట్‌ చేశాడు. వెంటనే దాన్ని డిలిట్‌ కూడా చేశాడు. కానీ పోస్టు గురించి మాత్రం సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే మొదలైంది. సమంతకు సన్నిహితుడైన ప్రీతమ్‌కు నాగచైతన్య గురించి కూడా ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉన్న మాట వాస్తవం. అతను పెట్టిన పోస్టును బట్టి ఆలోచిస్తే సమంత-నాగచైతన్య విడిపోయేందుకు ఇంకెవరో థార్డ్‌ పర్సన్‌(లేడీ) కారణం అయినట్లు అర్థం అవుతోంది. వాళ్లిద్దరూ విడిపోయారు.. ఇక చైతూ నీ వాడే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతమ్‌ పోస్టు పెట్టినట్లుగా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

Naga Chaithanya Samantha between A Woman - Suman TVఆ పోస్టును వెంటనే తొలగించడం కూడా నెటిజన్ల అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. సమంత- నాగచైతన్య మధ్య ఇంకో మహిళ రావడంతోనే వారిద్దరూ దూరం అయ్యారని సమంత అభిమానులు భావిస్తున్నారు. చైతూ-సామ్‌ విడిపోవడం ఇష్టంలేని ప్రీతమ్‌ అందుకు కారణమని భావిస్తున్న మహిళను ఉద్దేశించి కోసంతో ‘కంగ్రాట్స్‌ స్లట్‌.. హీ ఈజ్‌ యువర్స్‌’అంటూ అతని ఆవేదన వ్యక్తం చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ విషయమై కూడా సమంత ఎలాంటి రియక్షన్‌ ఇవ్వలేదు. అసలు ఇంతకీ ప్రీతమ్‌ పేర్కొన్న ఆ స్లట్‌ ఎవరూ? నిజంగానే చై-సామ్‌ మధ్య ఇంకో లేడీ ఉందా? ప్రీతమ్‌ ఆ పోస్టును డిలీట్‌ చేయడానికి కారణం ఏంటీ? వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.