Prakash Raj: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మిస్తూ.. స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణులతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేయబోతుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ఒకేచోట కరచాలనం చేస్తూ కనిపించేసరికి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
మా ఎలక్షన్స్ టైంలో మంచు విష్ణు ఓవైపు కాగా, ప్రకాష్ రాజ్ మరోవైపు.. ఆయనకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఎలక్షన్స్ టైంలో వీరి మధ్య యుద్ధవాతావరణం తలపించగా.. ఇప్పుడు షేక్ హ్యాండ్ చేసుకొని, కలిసి ఫోటోలకు పోజివ్వడంతో.. వీరి మధ్య రాజకీయం ఏమైందని సినీవర్గాలలో చర్చలు మొదలయ్యాయి. ఓవైపు ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు ట్రెండ్ అవుతుండగా, మరోవైపు పవన్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “నేను పవన్ కళ్యాణ్ ని అడిగాను.. మీరొచ్చారేంటి ఇక్కడికి? అని.. ఆయన ఏమన్నారంటే.. అర్జున్ గారంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఆయన పక్కన నిల్చోవాలని, విష్ చేయాలని అనిపించింది అన్నారు. పవన్ ఆ మాట అన్నారంటే.. అంతటి గౌరవాన్ని సంపాదించుకున్నాడు అర్జున్. ఆయన మంచితనమే ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.