అభిమానులకు పవన్‌ భారీ షాక్‌.. ఇక స్క్రీన్‌ పై పవర్‌ స్టార్‌ లేనట్టే..

సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం రిపబ్లిక్‌మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చాలా ఘనంగా సాగింది. రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతే కాకుండా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పవన్‌ కల్యాణ్‌ వాటిలో కొన్ని పవన్‌ అభిమానులకు షాక్‌లు కూడా తగిలాయి. గత కొంతకాలంగా ఇక నుంచి పవర్‌ స్టార్‌ ఉండదు అని కథనాలు వినిపించాయి. వాటిని పుకార్లుగానే లెక్కగట్టారు. వాటికి బలం చేకూర్చేలా గత కొన్ని అప్‌డేట్స్‌లో పవర్‌ స్టార్‌ పదం కనిపించలేదు. అప్పటి నుంచే అభిమానులు, భక్తులు కొద్దో గొప్పో నమ్మేశారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది. వాళ్లో వీళ్లో కాదు.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ నోటి నుంచి వాటిపై క్లారిటీ వచ్చేసింది. ఇక నుంచి పవర్‌ స్టార్‌ అని తీసేయండి అని పవన్‌ ఆదేశించాడు. ‘పవర్‌ లేనోడు పవర్‌స్టార్‌ ఏంటి? తీసేపారేయండిఅన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో అందరూ షాక్‌కు గురయ్యారు. అంటే ఇక నుంచి పవర్‌ స్టార్‌ అనే పదాన్ని అభిమానులు కచ్చితంగా మిస్‌ అవుతారు. పవన్‌ కల్యాణ్‌ అనే పేరు కన్నా.. పవర్‌ స్టార్‌గానే ప్రేక్షకులకు, అభిమానులకు సుపరిచితం.. ఇష్టం. మరి ఆ పవర్‌ స్టార్‌ అనే బిరుదు లేకుండా స్క్రీన్‌ బోసిగా ఉంటుందే అని బాధపడుతున్నారు.