ఫోటోగ్రఫిలో కొత్త టెక్నాలజీ ని అందించడమే ‘ఫోటో టెక్’ ఉద్దేశం

OTT Channels Opening

ప్రపంచంలోని సాంకేతికతను తెలుగు సినిమా వారి ముందుకు తీసుకొచ్చే మహత్తర కార్యక్రమానికి ‘ఫోటో టెక్’ సంస్థ శ్రీకారం చుట్టింది. ఫోటో టెక్ సంస్థ భారీ స్థాయిలో ‘హైదరాబాద్‌ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన గ్రాండ్ పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా.. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, హీరో శ్రీకాంత్, ఫోటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి తదితరులు హాజరయ్యారు.

OTT Channels Opening

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘గత పదిహేనేళ్లుగా ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఇలాంటి టెక్నాలజీ మనదగ్గరికి వచ్చింది. ఇలాంటి టెక్నాలజీని నిర్మాతలు అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే మంచి క్వాలిటీ సినిమా వస్తుంది’ అని తెలిపారు.

OTT Channels Opening

నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘ఈ టెక్నాలజీ గురించి సినిమా వాళ్లందరికీ తెలియాలి. అలాగే ఇందులో నవరసం, వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిం లకు అవార్డులు అందించే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాం’ అన్నారు.

OTT Channels Opening

ఫోటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ .. ‘ఫోటోగ్రఫి లో కొత్త టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతో ఈ ఫోటో టెక్ పెట్టడం జరిగింది. గతంలొ సినిమాకు సంబందించిన టెక్నాలజీ కోసం ముంబై వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ లోనే అన్ని రకాల టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు అభినందనలు తెలిపారు.

OTT Channels Opening