‘సత్యాగ్రహి’ సినిమాపై నోరు విప్పిన పవన్‌కళ్యాణ్‌

pawan kalyan

అప్పుడెప్పుడో 2003లో పవన్‌కళ్యాణ్‌ హీరోగా సత్యాగ్రహి అనే సినిమా ప్రారంభం అయింది. ఏవో కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. కాగా సత్యగ్రహి మూవీ పోస్టర్‌ను ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తి ఒక పొలిటికల్‌ సినిమాను చేయలనుకున్నట్లు చెప్పాడు. 2003లో ఆ సినిమాను చేద్దాం అనుకుని కుదరక దాన్ని అటకెక్కించినట్లు చెప్పారు. కానీ ఆయన స్ఫూర్తిని నిజ జీవితంలో నింపుకున్నట్లు పేర్కొన్నారు.

సినిమా చేయడం కంటే కూడా నిజ జీవితంలో ఆయన బాటలో నడుస్తుండడం నాకు చాల సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కాగా పవన్‌ నటించిన భీమ్లానాయక్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమా, క్రిష్‌ డైరెక‌్షన్‌లో హరహర వీరమల్లు సినిమాలు రానున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా ఉంటున్నారు.