'నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్'.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రీ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా విజయం ఇటు పూరికే కాకుండా అటు పవన్ కు కూడా మంచి గుర్తింపును అందించింది. అయితే ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ వచ్చిన మూవీ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం కూడా కమర్షియల్ గా మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమా తర్వాత పవన్-పూరీ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని సగటు ప్రేక్షకుడు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ హైట్రీక్ కాంబినేషన్ గురుంచి తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అదేంటంటే? ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఓ లైన్ చెప్పారట. ఇందులో పవన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడట, మరో విషయం ఏంటంటే? ఈ మూవీని పూరి కేవలం మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తానని పవన్ కు మాట ఇచ్చినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: టాలీవుడ్లో మోగిన సమ్మె సైరన్..! రేపటి నుంచి షూటింగ్స్ బంద్! దీంతో పవన్ కూడా పూరి సినిమాకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా కాస్త బిజీ అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలే ఉండడం విశేషం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ , బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ఉంది. ఈ మూవీ తర్వాతే పూరి జగన్నాథ్ తో పవన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే కూడా అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. మరోసారి రిపీట్ కానున్న పవన్ - పూరి కాంబినేషన్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.