Shrashti Maheshwari: కొన్ని నెలలుగా సినీతారలు, సీరియల్ ఆర్టిస్టులు వరుసగా పెళ్లి బాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు తాజాగా మరో టీవీ సెలబ్రిటీ పెళ్లి పీటలెక్కింది. పాపులర్ 'పాండ్యా స్టోర్' సీరియల్ నటి శ్రష్టి మహేశ్వరి.. జూన్ 19న బెంగుళూరుకు చెందిన టెక్ ఇంజనీర్ కరణ్ వైద్యను పెళ్లాడింది. ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నఈ జంట.. ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మహమ్మారి కారణంగా వారి వివాహాన్ని వాయిదా వేశారు. తాజాగా కరణ్ స్వస్థలం జైపూర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక పెళ్ళైన ఆనందంలో నటి శ్రష్టి భర్త కరణ్ గురించి మాట్లాడుతూ.. "కరణ్ తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి పెళ్లయ్యేదాకా మా మధ్య ఏమీ మారలేదు. కరణ్ తో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. నా పెళ్లిని చాలా ఆస్వాదించాను. నా పెళ్లిలో చాలా కలర్ ఫుల్ గా ఎంతో ప్రేమతో జరిగింది. నా భర్త కరణ్ చాలా రొమాంటిక్. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. 'జయమాల' వేడుకలో నన్ను తన చేతుల్లోకి ఎత్తుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్లాడు. నా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది." ప్రస్తుతం శ్రష్టి మహేశ్వరి - కరణ్ ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన పెళ్లిలో శ్రష్టి ఎరుపు రంగు లెహంగా.. అనంతరం రిసెప్షన్ కోసం వైట్ గౌను ధరించింది. ఈ విషయంపై శ్రష్టి మాట్లాడుతూ.. "ఇది డ్రీమ్ మ్యారేజ్. మేము అన్ని వివాహ దుస్తులను జాగ్రత్తగా ప్లాన్ చేశాము. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించాం." అని చెప్పుకొచ్చింది. మరి షూటింగ్ విషయమై ముంబైకి ఎప్పుడు తిరిగొస్తావు? అని అడిగితే.. "నేను ఈ నెలాఖరులోపు తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి, నేను నా భర్తతో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. కరణ్ అమెరికాలో పనిచేస్తాడు. కాబట్టి కొంత కాలం మాది లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ లా ఉండబోతుంది" అని తెలిపింది శ్రష్టి. ఇక కెరీర్ పరంగా శ్రష్టి మహేశ్వరి.. తాప్కీ ప్యార్ కి, దో దిల్ బంధే ఏక్ దోరీ సే, అలాద్దీన్ నామ్ తో సునా హోగా, దివ్య దృష్టి మొదలైన షోలలో నటించింది. మరి శ్రష్టి - కరణ్ పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by ♡vidhee♡chouhan♡ (@vidhee_9818) View this post on Instagram A post shared by mahimamahwari (@mahimamahwari)