పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి: నిహారిక

Niharika Fires on Posani Krishna Murali - Suman TV

నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త పోసాని కృష్ణమురళీ మంగళవారం ప్రెస్‌మీట్‌లో జనసేనాధినేత పవన్‌కళ్యాణ్‌, ఆయన కుటుంబంపై అసభ్యపదజాలతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పవన్‌కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక స్పందించారు. పోసానికి పిచ్చి పట్టిందని ఆయనను మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించాలని మండిపడ్డారు.

Niharika Fires on Posani Krishna Murali - Suman TVకాగా పోసాని అనుచిత వ్యాఖ్యలుపై సర్వత్రా విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. అర్థం లేకుండా ఇష్టమొచ్చినట్లు పోసాని మాట్లాడారని నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై బుధవారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌ పోసానిపై ఫిర్యాదు చేశారు. పవన్‌కళ్యాణ్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.