నాటు నాటు అంటూ సోహైల్, మెహ‌బూబ్‌ల డ్యాన్స్.. కేక పెట్టిస్తుందిగా..!

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న చిత్రం విడుదల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు.

ramachar minబాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన గ్లింప్స్ భారీ స్పందన లభించింది. ఇక తారక్- చెర్రీ మెరుపు లాంటి డ్యాన్స్ మూమెంట్స్, అదరగొట్టే కీరవాణి ట్యూన్లు, జక్కన్న మేకింగ్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైర‌వలు పాడిన నాటునాటు పాట‌ చిన్నా పెద్ద లను ఉర్రూతలూగిస్తుంది.

nar minఓ బామ్మ ఈ పాట‌కు స్టెప్పులేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీనిపై ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మెహ‌బూబ్ ‘నాటు నాటు’ పాటకు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేశారు. అచ్చం ఎన్టీఆర్, రామ్ చరణ్ లా స్టెప్పులు వేస్తూ సోహెల్, మెహ‌బూబ్ చేస్తున్న డ్యాన్స్ అదరహో అనిపిస్తుంది.  తాజాగా ఈ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది.