ఈ మద్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సోషల్ మాద్యమాల ద్వారా సెలబ్రెటీలు అయితే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీతారలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారానే వారి స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. సినీ తారల వారి సినిమాలా గురించి విషయాన్ని తెలియజేస్తూ.. అప్పుడప్పుడు హాలిడే, పర్సనల్ ఈవెంట్స్ ఇలా అన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఏ పండగలు, వివాహ కార్యక్రమాల్లో హీరోయిన్స్ సంప్రదాయ పద్ధతుల్లో కనిపించి ఆ ఫొటోస్, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందాల తార మెహ్రీన్ పిర్జాదా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ బారాత్‌లో డ్యాన్స్ చేసింది. మరో మహిళతో కలిసి రోడ్డుపై ఉత్సాహంతో చిందులు వేసింది. ‘పంజాబీ వెడ్డింగ్ సీన్స్’ అనే క్యాప్షన్‌తో మెహ్రీన్ పిర్జాదా పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిరన ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత ఈ అమ్మడికి తెలుగు లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల మంచిరోజులు వచ్చాయి, ఎఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషలలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. అభిమానులు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.