హీటెక్కిన మా ఎన్నికలు.. కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు

krishnamraju maa elections

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కాస్త హీటెక్కాయి. ఇక మా అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు సినీ ప్రముఖులను కలుస్తూ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కాగా ముందుగా పోటీలో ఉన్న జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహన్ వంటి ప్రముఖులు నిష్క్రమించటంతో పోటీ ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు మధ్య నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోటీ వీరిద్దరి మధ్యే ఉండటంతో మరింత ఆసక్తిగా మారింది.

ఇక ప్యానెల్ సభ్యులకు వింధులు, వినోదాలతో మా ఎన్నికల ప్రచారం కాస్త హీటెక్కుతున్నాయి. అయితే ఇప్పటికే నామినేషన్ లు సైతం వేసిన వీరిద్దరూ సినీ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 10 న మా ఎన్నికలు జరగనుండటంతో రోజు రోజుకు మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు తండ్రి మోహన్ బాబుతో పాటు సూపర్ స్టార్ క్రిష్టను కలిసి మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఇక తాజాగా మంచు విష్ణు సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజును కలిసి కాసేపు మా ఎన్నికల గురుంచి చర్చించుకున్నారు. అనంతరం మంచు విష్ణు తనకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా విష్ణు కృష్ణం రాజుతో దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.