హీటెక్కిన మా పోరు.. మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు

Manchu Manoj Released a Manifesto For Maa Election - Suman TV

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోరు రోజు రోజుకు కాస్త రసవత్తరంగా మారుతోంది. ఇక ఎట్టకేలకు ఇద్దరి మధ్యే జరగనున్న మా ఎన్నికలపై కాస్త ఆసక్తి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ తమ తమ ప్యానెల్ తో పాటు సినీ ప్రముఖలను కలుస్తూ వారి నుంచి మద్దతు కూడా గట్టుకుంటున్నారు.

ఇక ఎన్నికలకు సమయం కూడా కాస్త తక్కువే ఉండటంతో మా ఎన్నికలపై ఎన్నడు లేనంతగా హీరాహోరిగా సాగనుందని పరిస్థితులను చూస్తే అర్ధమవుతోంది. అయితే ఆక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనుండటంతో ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి కూడా వెనకాడటం లేదు. ఇక తాజాగా ఓటర్లను ఆకర్షించేందుకు అధ్యక్ష రేసులో ఉన్న మంచు విష్ణు తన మేనిఫెస్టోను విడుదల చేశాడు. ఇక ఇందులో మా సభ్యుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నామని తెలిపారు విష్ణు.

Manchu Manoj Released a Manifesto For Maa Election - Suman TVమేనిఫెస్టోలో ప్రధాన హామీలు

1.సొంత ఖర్చులతో మా భవన నిర్మాణం.
2.ఆర్థికంగా వెనకబడ్డవారికి ఇల్లు.
3. మా సభ్యుల పిల్లలకు ఫ్రీ ఎడ్యూకేషన్.
4.కళ్యాణ లక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు.
5.మా సభ్యులకు అందరికీ ఫ్రీ హెల్త్ స్కీమ్.
6.ESI హెల్త్ కార్డుల జారీ.
7. మా సభ్యుల పిల్లలకు మోహన్ బాబు ఫిల్మ్ స్కూల్ లో 50 శాతం          స్కాలర్‌షిప్‌తో శిక్షణ.
8.‘మా’లో కొత్తగా మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం.
9.అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా రూ.6000 పెన్షన్‌.