ఏపీ సీఎం జగన్ ని కలిసిన మంచువారి అబ్బాయి.. కారణం అదేనా?

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా స్థిరపడ్డారు. గత కొంత కాలంగా మంచు మనోజ్ నటిస్తున్న ఏ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతుంది. అయితే ఈ హీరో సోషల్ మాద్యమాల్లో చాలా చురుకుగా కనిపిస్తుంటారు. తాజాగా మంచు మనోజ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు.

manoj1 compressedఅయితే మంచు మనోజ్ సీఎం జగన్ ని ఎందుకు కలిశారు.. ప్రస్తుతం  తెలుగు ఇండస్ట్రీలో మా రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో యంగ్ హీరో మంచు మనోజ్ సీఎం జగన్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్‌తో సానుకూలంగా చాలా ఎక్కువసేపు మనోజ్ భేటీ కొనసాగిందని తెలుస్తుంది. తాజాగా ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి దిగిన ఫోటోని మనోజ్ పోస్ట్ చేశాడు మనోజ్.

manoj compressedఈ సందర్భంగా మంచు మనోజ్ “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల గురించి చర్చించాము. సమీప భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అద్భుతమైన ప్రణాళికలను విన్నాను. అవి అద్భుతంగా, ఆశాజనకంగా ఉన్నాయి. జగన్ సార్ మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు బలం, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీ పరిపాలనకు శుభాకాంక్షలు” అంటూ ట్విట్ చేశారు. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్‌ని స్థాపించి ఇందులో తొలిసారిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచు మనో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.