Vikrant Rona: కన్నడ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ, ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఈగ సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న సుదీప్.. ఆ తర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో, అలాగే తాను నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కి తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి కారణం అతని నటన, డెడికేషన్. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇతర భాషల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ముఖ్యంగా సుదీప్ వాయిస్, బాడీ లాంగ్వేజ్ కి తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువ. ఇక అందరితో పాటు త్వరలో సుదీప్ కూడా పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో చేరనున్నాడు. ఆయన నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రం వివిధ భాషల్లో.. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో జులై 28న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ రిలీజ్ చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో ''అది ఒక మర్మమైన ఊరు.. ఆ ఊరు ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరుగానీ.. భయాన్ని దాచలేరు" అనే వాయిస్ ఓవర్ థ్రిల్లింగ్ కి గురిచేస్తుంది. ఆ ఊరిలోని రహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన అధికారిగా సుదీప్ కనిపిస్తున్నాడు. మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహించారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.