సెక్షన్‌ 28: సమంత- నాగ చైతన్య విడాకులు.. ప్రముఖ లాయర్‌ బయటపెట్టిన కీలక విషయాలు

samantha naga chaitanya

సమంత- నాగచైతన్య విడాకుల తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. వాళ్ల విడాకుల విషయంలో ప్రముఖ న్యాయవాది చెప్పిన కీలక విషయాల వీడియో ఇప్పుడు యుట్యూబ్‌లో వైరలవుతోంది. అందులో ఆయన ఏం చెప్పారో చూద్దాం. ‘ప్రస్తుతం సమంత- నాగచైతన్య వారు విడిపోతున్నట్లు ప్రకటించారు అంతే. వారికి ఇంకా అధికారికంగా విడాకులు రాలేదు. అలా విడాకులు వచ్చేందుకు ‘హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 28’ ప్రకారం ఇకా ఆరు నెలలు ఆగాలి. ఈ ఆరు నెలలో వారికి కోర్టు తరఫున కౌన్సిలింగ్‌ ఉంటుంది. ఇప్పటికే వారికి బయట కౌన్సిలింగ్‌ జరిగినా.. అది కోర్టు పరిధిలోకి రాదు. కావున వారికి మరోసారి కౌన్సిలింగ్‌ ఉంటుంది. వారు ఇరువురూ మేజర్లు కాబట్టి ఈ ఆరు నెలల కాలంలో వారి నిర్ణయంపై పునరాలోచన చేసుకునేందుకు సమయం ఇస్తారు. ఆరు నెలల తర్వాత కూడా వారు అదే నిర్ణయం మీద ఉంటే విడాకులు మంజూరు చేస్తారు’ అని ప్రముఖ న్యాయవాది చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో యుట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఎవరీ ప్రీతమ్‌ జుకల్కర్‌.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?