Diganth: ప్రముఖ కన్నడ హీరో దిగంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లిన దిగంత్.. సరదాగా బీచ్ లో ఆడుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. బీచ్ లో జంప్ చేసే క్రమంలో.. అనుకోకుండా కింద పడిపోయి మెడకు తీవ్రంగా గాయమైనట్లు కన్నడ సినీవర్గాల సమాచారం. ఇక వెంటనే గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన కుటుంబ సభ్యులు.. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఎలాంటి ఆలస్యం చేయకుండా బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దిగంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది అప్ డేట్ రావాల్సి ఉంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న దిగంత్.. తెలుగులో వాన అనే సినిమాలో కనిపించాడు. అదే అతనికి తెలుగులో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. మిస్ కాలిఫోర్నియా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దిగంత్.. మొదటి నుండి పూర్తిగా కన్నడ పరిశ్రమకే పరిమితమయ్యారు. ఇక కెరీర్ పరంగా గాలిపాట, హౌస్‌ఫుల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దిగంత్.. ఇప్పుడు అడివి శేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఎవరు' కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు. అలాగే మరో నాలుగు సినిమాలు సైతం కంప్లీట్ చేసినట్లు టాక్. ఇలా మంచి ఫామ్ లో ఉండి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైంలో ప్రమాదం జరగడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం దిగంత్ ప్రమాదానికి గురైన వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Actor #Diganth has been brought to Manipal hospital airport road. He has has suffered a neck injury. pic.twitter.com/2HxNg79vPC — Imran Khan (@KeypadGuerilla) June 21, 2022