సమంత విడాకులకు కారణం ఇతనేనా..? దారుణమైన ప్రచారం!

సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సమంత కూడా ఇన్‌స్టాగ్రాంలోఈ విషయాన్ని ధృవీకరించారు. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో చైతూ-సామ్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.. వాటన్నింటికి నిన్నటితో క్లారిటీ ఇచ్చారు ఈ జంట. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు. అయితే ఈ జంట విడిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఫ్యామిలీ మేన్ 2 చిత్రంలో సమంత బోల్డ్ సీన్లో నటించడం అక్కినేని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారని.. ఈ విషయంలో చైతూ కూడా అసహనానికి గురయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

sangar minమరోవైపు చైతూని ఓ బాలీవుడ్ స్టార్ ప్రభావితం చేశారని.. అతని సలహా మేరకే సమంతతో విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.. అయితే ఇప్పుడు సమంత విడాకులపై అక్కినేని ఫ్యాన్స్ లోని కొందరు నెగిటీవ్ ట్రోలింగ్ కి తెరలేపుతున్నారు. సమంతానే అక్కినేని ఫ్యామిలీతో ఉండలేక కావాలనే విడిపోతుందని అంటున్నారు. బోల్డ్ సినిమాల్లో నటించటం, డ్రెస్సింగ్ స్టైల్, పిల్లలపై ఫోకస్ పెట్టకపోవడం ఇలా ఏవేవో కారణాలు చెబూతూ చెప్తూ.. సమంతని బ్యాడ్ చేసే ట్రోలింగ్ నడుస్తుంది.

dfasgag 1తాజాగా తెరపైకి కొత్త వివాదం పుట్టుకు వస్తుంది. సమంత వ్యక్తిగత ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్‌ జుకల్కర్‌ ఒడిలో కాళ్లు పెట్టుకుని దిగిన ఫోటోను అడ్డుపెట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఒకప్పుడు సమంత పెట్టి డిలీట్ చేసిన ఈ పోస్ట్ ని వాడుకుంటున్నారు ట్రోలర్స్. అక్కినేని ఇంటి కోడలు అయిఉండి.. సమంత ఇంకా బ్యాచ్ లర్ లానే ప్రవర్తిస్తుందని.. పెద్ద కుటుంబాల్లో పద్ధతులు పాటించాలని ఆమెపై కొంత మంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.