బాలయ్య-బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?

akhanda movie

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూవీలో ఏరేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన సంచలనం అంతాఇంతా కాదు. లెజెండ్ లో బాలయ్యను బోయపాటి ఒక రేజ్ లో చూపించాడు. “నాకు ఒకడు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకటికి ఎదురెళ్లిన వాడికే రిస్క్” అనే బాలయ్య డైలాగ్ వీరిద్దరి కాంబినేషన్ కు వర్తిస్తుంది. అదే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న అఖండ మూవీ కూడా సరిపోతుంది. లెజెండ్, సింహా తర్వాత వీరి కాంబినేషన్ లో రానున్న ‘అఖండ’ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందనే అందరు అనుకుంటున్నారు.

అలా అనుకోవడానకి కారణం ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు, సింగిల్స్, స్టిల్స్ అన్ని అఖండపై అంచనాలు ఎవరెస్టు అంత ఎత్తులో నిలబెట్టాయి. ఇక సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవలే అఖండ మూవీ సెన్సార్ పని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అసలు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటేనే యాక్షన్ సన్నివేశాల కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు అఖండ కూడా అదే స్థాయిలలో ఉందని.. అందుకే యూ / ఏ సర్టిఫికెట్ వచ్చిందని అంటున్నారు. ఇక అఖండ సినిమా నిడివి 2 గంటల 47నిమిషాలు, అంటే 167 నిమిషాల ఉందట.

అఖండ లో మొత్తం మీద 45 నిమిషాల పాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సెన్సార్ టాక్. బాలయ్య రెండు విభిన్న పాత్రలో కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రిట్ ఇవ్వనున్నారు అని అంటున్నారు. ఇక అఘోర పాత్ర ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న వాటి కంటే కొత్తగా ఉన్నట్లు తెలుస్తుంది. అదిరిపోయే పవర్ ఫుల్ డైలాగులు కూడా బాలయ్య అభిమానులనే కాకుండా.. మాస్ ఫ్యాన్స్కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయంటున్నారు.

లెజెండ్ లో మాదిరిగానే అఖండా మూవీలో బాలయ్య మార్క్ డైలాగులు, విలన్ పాత్రలో శ్రీకాంత్, ఇతర పాత్రలల్లో జగపతిబాబు, ప్రగ్య జైశ్వాల్ అందాలు అన్నీ సినిమాకు హైలెట్స్ కానున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఇక సినిమా రిలీజ్కు టైం దగ్గర పడుతుండడంతో ప్రచారం కూడా భారీ ఎత్తున చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.