సూపర్ బైకులంటే.. హీరోలకు ఎందుకంత మోజు..!

సినిమా ల్లో హీరోలు బైక్స్, కార్ల ఛేజింగ్ సీన్లు వస్తుంటే.. ఫ్యాన్స్ పూనకాలు వచ్చినవారిలా ఊగిపోతుంటారు. వెండితెరపై ఖరీదైన కార్లు.. బైక్ లపై హీరోలు చేసే ఛేజింగ్ సీన్లు అంటే గ్రాఫిక్స్ తో రూపొందించబడతాయి.. కానీ కొంత మంది కుర్రాళ్లు నిజ జీవితంలో అలాంటి స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

heros biie minతాజాగా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఈ సెలబ్రెటీలకు ఇలాంటి ప్రమాదాలు కొత్తమేకా కాదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ కుమారులిద్దరూ బైక్ యాక్సిడెంట్స్ లోనే చనిపోయారు. క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు కూడా హైదరాబాద్ రోడ్స్ పై స్పోర్స్ బైక్ పై రైడ్ కి వెళ్లి ప్రాణాలొదిలారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలకు సూపర్ బైక్స్ మహా పిచ్చి అంటుంటారు. చిరు, నాగార్జున, వెంకటేశ్, బాలయ్య లాంటి హీరోలు అప్పట్లో బైక్ ఛేజింగ్ సీన్లలో నటించి మెప్పించారు.

bike2 minఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి ఛేజింగ్ సీన్లలో ఎక్కువగా నటించేవారు. అయితే స్పోర్ట్స్ బైక్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారిలో నాగార్జున ఒకరు. ఈ తరం హీరోలు మొత్తం ఇంపోర్టెడ్ బైక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంపోర్టెడ్ బైక్స్ అంటే పవన్ కళ్యాణ్ కి తెగ పిచ్చి అంటారు.. ఆ ఇష్టమే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి కూడా వచ్చిందంటారు. హార్లే డేవిడ్ సన్ బైక్ ని తొలిసారిగా ఇంపోర్ట్ చేసుకున్న హీరోగా పవన్ అప్పట్లో వార్తల్లోకెక్కారు. తన సినిమాల్లో కూడా పవన్ ఎక్కువగా అలాంటి బైక్స్ తోనే కనిపిస్తుంటారు.

pawa minహీరో ప్రభాస్ కి కూడా ఇంపోర్టెడ్ బైక్స్ ఎంతగా ఇష్టమంటే.. తనకు ఏమాత్రం సమయం దొరికినా స్పోర్ట్స్ బైక్ రెయ్.. అంటూ చక్కర్లు కొడుతుంటాడు. ప్రభాస్ కి బైక్స్ తో పాటు ఇంపోర్టెడ్ కార్లు అన్నా మహా పిచ్చి అంటుంటారు. సాహోలో రెబల్ స్టార్ బైక్ రేసింగ్, స్టంట్స్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ దగ్గర ప్రస్తుతం 6 రకాల వెరైటీ బైక్స్ ఉన్నాయట. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంపోర్టెడ్ బైక్స్ అంటే మహా సరద.. ఏపీలో తొలి హార్లే డేవిడ్ సన్ బైక్ ని సొంతం చేసుకున్న హీరో ఎన్టీఆర్.

ntr minనగరంలో అప్పుడప్పుడు ఇలాంటి బైక్స్ పై తన ఫ్యామిలీతో చక్కర్లు కొడుతుంటాడ.. ఆ సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల వీరిని ఎవరూ గుర్తుపట్టరు. ఎన్టీఆర్ వద్ద కూడా ఇంపోర్టెడ్ బైక్స్ ఉన్నాయి. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో వీరికి బైక్స్ చాలా ఇష్టం అంటారు. తాము ఎంతో ఇష్టపడే బైక్స్ పై ఎవరి కంటా పడకుండా హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ రోడ్స్ పై హీరోలు చక్కర్లు కొడుతుంటారు. అయినా అప్పుడప్పుడు కెమెరాల కంటపడటం.. ఫోటోలు వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.