చైతూ లేకుండా.. మరొక వ్యక్తితో సమంత గోవా ట్రిప్! పిక్స్ వైరల్

Heroine Samantha Weekend Goa Trip With Her Friend Pics Viral -Suman TV

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ జరిగింది. కానీ.. ఈ దంపతులు మాత్రం ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తమ విడాకుల వార్తలు పుట్టించిన వారిని మాత్రం కుక్కలతో పోల్చి.. సమంతా ఈ గాచిప్ కి బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది. అయితే.., ఈ ట్వీట్ కారణంగా కూడా సామ్ చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సమంతాకి సంబంధించిన మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్.. చైతూతో కాకుండా మరో వ్యక్తితో గోవా ట్రిప్ కి వెళ్లడమే ఈ వార్తలకి కారణం.

Heroine Samantha Weekend Goa Trip With Her Friend Pics Viral -Suman TVసమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూట్ తాజాగా ఫినిష్ అవ్వడంతో సమంత గోవా ట్రిప్ కి చెక్కేసింది. అయితే.., సమంతాతో పాటు గోవాకి వెళ్ళింది ఎవరో కాదు.. ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి. వీరిద్దరూ కలసి గోవాలోని పబ్లిక్ ప్లేసుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది సామ్. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.., ఈ ట్రిప్ లో నాగచైతన్య లేకపోవడానికి కారణం ఉంది. చైతూ నటించిన “లవ్ స్టోరీ” మూవీ విడుదలకి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం చైతూ.. వెకేషన్ కి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)