ఇండస్ట్రీలో విషాదం! ఘంటసాల కుమారుడు మృతి

ఒకవైపు కరోనా కష్టం సినీ ఇండస్ట్రీస్ కి తీవ్ర నష్టాలను మిగిలిస్తోంది. మరోవైపు ఇదే సమయంలో వరుస విషాదాలు పరిశ్రమలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మరో విషాదం నెలకొంది. సినిమా పాటకి పట్టం కట్టిన లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఈయన గుండెపోటుతో చెన్నైలో మరణించడం జరిగింది. ఈయన కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది. రత్న కుమార్ ఇటీవల కరోనా వైరస్ బారీన పడ్డారు. రెండు వారలా ట్రీట్ మెంట్ అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపు ఆయనకి కిడ్నీ సమస్య తిరగబెట్టింది. అందుకు తగ్గ చికిత్య తీసుకుంటుండగా, ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో పరిస్థితి చేజారిపోయింది. ఘంటసాల రత్న కుమార్ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా పాపులర్ అయ్యారు.

ganta 2రత్న కుమార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్ఖాన్, షారుక్ఖాన్లకు ఎక్కువ డబ్బింగ్ చెప్పారు రత్న కుమార్. అంతేకాదు కొన్ని సినిమాలకు మాటలను అందించారు. వాటిలో ముఖ్యమైనవి ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ సినిమాలున్నాయి. ఆయన కుమార్తె వీణ కూడా తెలుగులో నేపథ్య గాయనిగా రాణిస్తోంది. అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా ఆమెకి మంచి పేరు దక్కింది. తెలుగు సినిమా పాటకి తన గాత్రంతో పట్టాభిషేకం చేసిన ఘంటసాల వారసుడు అయినా.., రత్న కుమార్ ఎన్నడూ అవకాశాల కోసం తండ్రి పేరుని వాడుకోలేదు. ఉన్నన్ని నాళ్ళు ఆయన తన పేరు కోసం ప్రయత్నాలు చేస్తూనే, తండ్రి కీర్తి ప్రతిష్ఠలకి భంగం కలగకుండా చూసుకున్నారు. ఏదేమైనా ఘంటసాల రత్నకుమార్ అకాల మృతికి సినీ ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది. మీరు కూడా కామెంట్స్ రూపంలో ఆయనకి శ్రద్ధాంజలి తెలియచేయండి.