కథ అన్నతో …సినిమా తమ్ముడితో!?

కధ ఒక హీరోకి చెప్పినా డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గానీ, ఇమేజ్ ని దృష్టిలోపెట్టుకుని గానీ ఆ హీరో ఆ కధ చేయకపోవచ్చు. ఇండ‌స్ట్రీలో ఒక‌రితో చేయాల్సిన క‌థ‌ను మ‌రో హీరోతో చేయ‌డం అనేది చాలా కామ‌న్‌. ఇప్ప‌టికే చాలామంది సినిమాలు అలా తీసి హిట్లుకూడా కొట్టారు. దాంతో ఆసినిమా తాము ముందు చేసి ఉంటే బాగుండేద‌ని ఆ హీరోలు బాధ‌ప‌డ‌టం కూడా ప‌రిపాటి. ఇప్పుడు ఇదే కోవలో అన్న‌తో చేయాల్సిన క‌థ‌ను త‌మ్ముడితో చేస్తున్నాడో ఓ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌.

Ram charanవెంకి కుడుముల తీసిన‌వి రెండు సినిమాలే అయినా మంచి హిట్ కొట్టాడు ఆరెండింటితో. నాగశౌర్యతో తీసిన ఛ‌లో సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. అలాగే నితిన్‌తో భీష్మ మూవీ కూడా మంచి స‌క్సెస్ సాధించింది. అయితే ఈ రెండు సినిమాల్లో ర‌ష్మిక మండ‌న్న‌నే హీరోయిన్‌గా చేసింది. ఇక ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేసేందుకు వెంకీ ప్లాన్ చేయ‌గా ఈయ‌న చెప్పిన కథ‌ల‌కు చ‌ర‌ణ్ ఓకే చెప్ప‌లేదట‌.

చ‌ర‌ణ్ ఇప్పుడు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ చేస్తుండ‌తా త‌ర్వాత ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంకర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ క‌థ‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు చెప్పి ఒప్పించాడంట వెంకీ. ప్ర‌స్తుతం వ‌రుణ్ చేస్తున్న గ‌ని, ఎఫ్ -3 మూవీలు అయిపోగానే ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కిస్తారట‌.