ఆ అంబులెన్స్ డ్రైవర్‌ – కన్నడ రుస్తుమ్!!.

ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్‌, ప్రియాంక చోప్రా, ఆలియాభట్‌, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా అంబులెన్స్‌ను స్వయంగా నడుపుతూ పలువురు కోవిడ్‌ రోగులకు సహాయం అందించాడు.

download 1 2

ప్రస్తుత పరిస్థితులను లెక్క చేయకుండా కొందరు సెలబ్రిటీలు విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. మరికొందరు ఫ్యాన్సీ ఫోటోషూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అలాంటి సెలబ్రిటీలపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అర్జున్ గౌడ చేసిన పనిని మెచ్చుకొని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కోవిడ్‌ రోగులను తరలించడానికి అతను అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. అతను గత రెండు రోజులుగా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాడు.

download 3 1

ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్ను రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్‌ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు. ‘అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌’, ‘రుస్తుమ్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అర్జున్ గౌడ చేస్తోన్న మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ అర్జున్ గౌడను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here