Sreemukhi: తెలుగు బుల్లితెరపై గ్లామర్ ఒలకబోసే యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీల తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖినే పేరు తెచ్చుకుంది. మరీ వాళ్లంతా కాకపోయినా గ్లామర్ విషయంలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని.. స్కిన్ షోకి కొన్ని హద్దులు కూడా పెట్టుకుంది. కానీ.. ఈరోజుల్లో స్కిన్ షో అనేది ఎంత కామన్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరు ఎంత ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచితే సోషల్ మీడియాలో అంత క్రేజ్ దక్కుతుంది. ఈ విషయాన్ని అప్పుడప్పుడు శ్రీముఖి కూడా ఫాలో అవుతుంది. ఆ మధ్యలో బిగ్ బాస్ తర్వాత బోల్డ్ ఫోటోషూట్స్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకోమరి ఆ తర్వాత మెల్లగా అందాల ఆరబోతకు బ్రేక్ వేసింది. ఇక అప్పటినుండి కొత్త కొత్త కాస్ట్యూమ్స్ లో ఫోటోషూట్స్ చేస్తోంది. కానీ.. సడన్ గా ఏమైందో గాని, తాజాగా శ్రీముఖి తన గ్లామర్ కి ఉన్న హద్దులను, గీసుకున్న గీతలను చెరిపేసి సర్ప్రైజ్ చేసింది. ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో తడితడి అందాలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న శ్రీముఖి.. తాజాగా ఎన్నడూ చూడని రేంజిలో థైస్ షో చేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. అసలే హీరోయిన్లతో సరిసమానమైన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ భామ.. కొంగొత్తగా టాప్ టు బాటమ్ అందాలు బంగారు వర్ణపు మినీ డ్రెస్ లో పోస్ట్ చేసేసరికి గ్లామర్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్థాయిలో శ్రీముఖి అందాలను ఎప్పుడూ ఆస్వాదించలేదని కామెంట్స్ కూడా చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా.. శ్రీముఖి ఓవైపు యాంకర్ గా టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు యాక్టర్ గా సినిమాలు కూడా చేస్తోంది. ఇటీవలే 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో నటించిన శ్రీముఖి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ మూవీలో అలరించబోతుంది. మరి శ్రీముఖి సరికొత్త బోల్డ్ ఫోటోషూట్ అయితే ఫ్యాన్స్ ని విశేషంగా అట్రాక్ట్ చేస్తోంది. మరి శ్రీముఖి లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi)