యాంకర్ శివ.. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో చేస్తూ బాగాపాపులర్ అయిన యాంకర్. ఈ మధ్యకాలంలో పాపులర్ అవ్వడంతో ఏకంగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే హౌస్ లో తనదైన రీతిలో ఆడిన శివ జనాలకు ఇంకాస్త దగ్గరయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా తన దూకుడును ఏ మాత్రం కూడా తగ్గించడం లేదు. అరియానాతో యాంకర్ శివ తెగ చిందులేస్తూ ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. అయితే ఈ యాంకర్ తాజాగా పక్కా కమర్షియల్ హీరోయిన్ రాశీఖన్నాతో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో యాంకర్ శివ ఏకంగా రాశీఖన్నాతోనే పులిహోర కలిపి మరోసారి నెటజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఏకంగా హీరోయిన్ కే ప్రపోజ్ చేసి రాశీఖన్నా షాక్ కు గురయ్యేలా చేశాడు. అయితే ముందుగా యాంకర్ శివ.. మీకు కాబోయే భర్త మంచి భక్తుడు అయ్యి ఉండాలని అపుడెపుడో ఓ ఇంటర్వ్యూలో అన్నారు కదా.. ‘నేను మంచి భక్తుడ్నే ట్రై చేసుకోవచ్చా’ అని అన్నాడు. దీంతో రాశీ ఖన్నా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. హో.. అవునా.. సర్లే ఇంటర్వ్యూ తరువాత మాట్లాడదాం అని అనేసింది. ఇది కూడా చదవండి: Ariyana Glory: అరియానాకు ఐలవ్యూ చెప్పిన కుర్రాడు! చివర్లో మాత్రం.. అనంతరం రాశీఖన్నా.. భక్తి కంటే ముందు ఆ వ్యక్తితో కనెక్షన్ ఉండాలి. ఎవరితో ఎప్పుడు కనెక్ట్ అవుతామో మనకు తెలియదు. ఎవరితో అయినా అవ్వొచ్చు అంతా దైవాదీనం.. మంచి హార్ట్ ఉండాలి’ అని చెప్పింది రాశీ. దీంతో వెంటనే స్పందించిన శివ.. నాకు చాలా హార్ట్ ఉంది.. పైగా నేను మీ భక్తుడ్నే.. పెళ్లి చేసుకుంటారా? అని అడిగేశాడు. ఆ మాటకి పెద్దగా నవ్వినా రాశీ.. ‘నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు’ అని సిగ్గుపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ రాశీఖన్నాకు యాంకర్ శివ ప్రపోజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.