హైదరాబాద్ వీధుల్లో అనసూయ హాట్ ఫోటో షూట్

Anasuya

ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోను నటిస్తూ ప్రేక్షకుల ను అలరిస్తూ వస్తోంది. ఇక అనసూయ యధావిధిగానే సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ గా ఉంటోందన్న సంగతి అందరికి తెలిసిందే. తనకు సంబందించిన ఏ చిన్న విషయాన్నైనా వెంటనే అభిమానులతో పంచుకుంటుంది అనసూయ. ఇక ఎప్పటికప్పుడు ఫొటోషూట్‌ లు చేస్తూ అభిమానులకు కనులవిందు చేసే రంగమ్మత్త, ఎందుకో ఈ సారి మాత్రం కాస్త డోసు పెంచింది. బ్లాక్‌ డ్రెస్‌ మోకాళ్లపై వరకు ధరించి హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటో షూట్ చేసింది. అంతే కాదు వెంటనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది అనసూయ. ఇంకేముంది అనూ హాట్ ఫోటోలకు ఎప్పటిలాగే కుర్రకారు పడిపోయారని వేరే చెప్పక్కర్లేదు కదా. అంతే మరి అనసూయ ఏంచేసినా స్పెషలే అని ఆమె అభిమానులు అంటున్నారు.

maxresdefault 2

ఏకంగా ఇద్దరూ పిల్లల తల్లైన అనసూయ టీవీ షోలతో పాటు, వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది. సినిమమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లో హోయలొలికిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో విజయ్‌ సేతుపతితో, మాలయాళంలో సూపర్ స్టార్ మోహాన్‌ లాల్‌ తో కలిసి నటించే ఛాన్స్‌ కూడా కొట్లెసింది అనసూయ భరద్వాజ్.