పుష్ప హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్!

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ప్రపంచవ్యాప్తంగా 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప.. ఐదు భాషల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా కూడా పుష్పరాజ్ సత్తా చాటాడని చెప్పవచ్చు. థియేట్రికల్ రిలీజైన మూడు వారాలు పూర్తి కాగానే పుష్ప మూవీ జనవరి 7న OTT లో విడుదలైంది.

ప్రస్తుతం పుష్ప అమెజాన్ ప్రైమ్ వేదికగా దక్షిణాది నాలుగు(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఈ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ లాగే ఓటిటిలో కూడా మంచి వ్యూయర్ షిప్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. సరే సౌత్ ప్రేక్షకులకు అందుబాటులోకి పుష్ప ఓటిటి వెర్షన్ వచ్చేసింది. మరి ఉత్తరాది ప్రేక్షకుల సంగతేంటని.. ట్విట్టర్ లో ఫ్యాన్స్ అమెజాన్ ప్రైమ్ వారిని అడుగుతున్నారు.

పుష్ప హిందీ వెర్షన్ కోసం ట్విట్టర్ లో ఫ్యాన్స్ పెట్టిన రిక్వెస్టులు గమనించిన అమెజాన్ యాజమాన్యం.. తాజాగా పోస్టుతో స్పందించింది. ‘పుష్ప హిందీ వెర్షన్ కావాలంటే 15వేల రీట్వీట్స్ పూర్తి చేయాలనీ, అప్పుడే పుష్ప హిందీ వెర్షన్ రిలీజ్ చేస్తాం. తగ్గేదేలే’ అంటూ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పెట్టిందే తడవుగా ఫ్యాన్స్ అంతా పుష్ప కోసం రీట్వీట్స్ చేయడం ప్రారంభించారు. కేవలం పోస్ట్ పెట్టిన మూడు గంటల్లోనే రీట్వీట్స్ 11వేలు దాటిపోవడం విశేషం. దీన్ని బట్టి ఫ్యాన్స్ హిందీ వెర్షన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుంది. పుష్ప హిందీ వెర్షన్ సంక్రాంతి కానుకగా అమెజాన్ ప్రైమ్ జనవరి 14 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం పై క్లారిటీ రావడంతో పుష్ప ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ టార్గెట్ పూర్తికాగానే పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించింది. మరి పుష్ప హిందీ స్ట్రీమింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.