శంకర్ పల్లిలో భూమిని కొన్న అల్లు అర్జున్.. దీని కోసమేనట!

allu arjun Shanker Palli Land - Suman TV

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో కాస్త బిజీగా మారాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ శంకర్ పల్లి ప్రాంతంలో రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.

దీనికి సంబంధించి శుక్రవారం శంకర్ పల్లిలోని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇక ఈ ప్రాంతానికి అల్లు అర్జున్ వచ్చాడన్నసమచారంతో ఫ్యాన్స్ పరుగులు పెట్టుకుంటూ అక్కడ వాలిపోయారు. ఇక అతనితో సెల్ఫీలు దిగేందుకు తన అభిమానులు క్యూ కట్టడంతో ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించాడు.

ఇక విషయం ఏంటంటే..? శంకర్ పల్లిలో కొన్న ఆ రెండెకరాల భూమిలో బన్ని వ్యవసాయం చేయనున్నాడట. ఈ ప్రదేశంలో ఆర్గానిక్ పద్దతుల్లో కూడిన వ్యవసాయం చేయనున్నాడని తెలుస్తోంది. దీని కోసమే ఇష్టపడి మరీ బన్నీ ఈ ల్యాండ్ కొనుగోలు చేసినట్లు సమచారం. దీంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతం కావటం, ఫ్యామిలీతో సరదాగా అప్పుడప్పుడు వెళ్లటానికి ఇదే అనువైన ప్రదేశమని అల్లు అర్జున్ భావించినట్లు తెలుస్తోంది.