అల్లు అర్జున్ ఫన్ స్టఫ్.. వీడియో వైరల్!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.. వస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సోదరుడు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంలో చాలా సింపుల్ గా కనిపించినా.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు చిత్రంలో తన విశ్వరూపం చూపించాడు అల్లు అర్జున్. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ లో ప్రత్యేక స్టైల్ చూపించాడు.. అందుకే ఫ్యాన్స్ ఆయన్ని స్టైలిష్ స్టార్ అంటారు.

bunny1 compressedప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి అందరికీ  తెలిసిందే. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. చిత్రానికి సంబంధించిన అన్ని విశేషాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు స్టైలిష్ స్టార్ కి మాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం మలయాళంలో రిలీజ్ చేసి మంచి విజయం అందుకున్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ ప్రతి సినిమా మలయాళంలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అక్కడ కూడా బన్నీ అంటే పిచ్చెక్కిపోయే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.

bunny compressedమాలీవుడ్ లో అభిమానులు అల్లు అర్జున్ ను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. నిత్యం నెట్టింట్లో యాక్టివ్‏గా ఉంటే అల్లు అర్జున్.. సోమవారం ఓ ఫన్నీ టాస్క్ చేసారు. ఇన్‏స్టా స్టోరీలలో ఉండే ఫిల్టర్ల ద్వారా మీరు ఏ మల్లు యాక్టర్ ? అని ఇన్ స్టా ఫిల్టర్‏లో అల్లు అర్జున్ చెక్ చేసుకోగా.. మాలీవుడ్ యాక్టర్స్ అందరిలో విలక్షణ నటుడు కుంచాకో బోబన్‏ను మ్యాచ్ చేసి చూపించింది. అంతే ఈ వీడియోను బన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఫన్ స్టఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది సోషల్ మాద్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఇక మాలీవుడ్ నటుడు కుంచాకో బోబన్‏ విషయానికి వస్తే.. హీరోగా దాదాపు 90 సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలతో అలరిస్తూ విలక్షణ నటుడిగా మాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న నిఫా వైరస్, మిడ్ నైట్ మర్డర్స్, నీడ వంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు.