మందను వదిలి కొత్త దారిలో వెళ్తున్న ‘మోస్ట్‌ ఎల్జిబుల్‌ బ్యాచిలర్‌’.. ట్రైలర్‌ మాములుగా లేదుగా!

Most Eligible Bachelor

‘అక్కినేని అఖిల్‌’ తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎల్జిబుల్‌’ బ్యాచిలర్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్‌ రానే వచ్చింది. అఖిల్‌, పూజా హెగ్దే జంటగా వస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్నాడు. కొవిడ్‌ కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్‌, పూజా హెగ్దే లుక్స్‌ ఎంతో కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో లవ్‌, కామెడీ, క్లారిటీ, క్రేజీ క్వశ్చన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ చిత్రం అక్టోబర్‌ 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రలో నటిస్తున్నారు.