పడక సుఖం ఇస్తేనే ఆఫర్లు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు?

చలన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది హీరోయిన్లు తమ గళం విప్పారు. తెలుగు లో శ్రీరెడ్డి దీని గురించి పెద్ద పోరాటమే చేసింది.. కానీ అంతలోనే డ్రాప్ అయ్యింది. పలు ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం నేపథ్యంలో హీరోయిన్లు గతంలో తమకు జరిగిన చేదు అనుభవాల గురించి బహిరంగంగా స్పందించారు. అయితే కొంద‌రు త‌మ‌ని వేధించిన వారి పేర్లు బ‌య‌ట‌పెడుతుండ‌గా, మ‌రికొంద‌రు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయంలో కొంత మంది అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి దారుణమైన కామెంట్స్ చేసింది నడుం వంపుల గోవా బ్యూటీ ఇలియానా. రామ్‌ హీరోగా నటించిన ‘దేవదాసు’ చిత్రంలో తెలుగు  ప్రేక్షకులను పలకరించింది ఇలియానా. ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ అగ్ర నిర్మాతల దృష్టిలో పడింది. అప్పట్లో స్టార్ హీరోలు ఈ బ్యూటీ సరసన నటించేందుకు తెగ ఉత్సాహ పడ్డారు. తెలుగు లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని రికార్డులు క్రియేట్ చేసింది.

తెలుగులో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్‌కి వెళ్లిన ఇలియానా అక్క‌డ పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. కొన్నాళ్ల‌కు సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ఇలియానా తన కెరీర్ మళ్లీ ఆరంభించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఇలియానా క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఛాన్సులు రావాలంటే కచ్చితంగా పడుకోవాల్సిందే.. లేదంటే కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పాల్సిందే అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు వాళ్లకు ఛాన్సులు రావాలంటే మాత్రం దర్శక నిర్మాతలతో పడుకోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఇలియానా వ్యాఖ్యలతోనే అర్థమవుతుంది.