Actor Murali Mohan Home Tour: ప్రముఖుల ఇళ్లకు సంబంధించిన హోం టూర్లు ఈ మధ్య చాలానే వచ్చాయి. పెద్ద పెద్ద సెలెబ్రిటీల ఇళ్లను చూస్తే.. సామాన్యుల మతిపోవాల్సిందే. ఒక దాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇళ్లా?.. లేక ఫైర్ స్టార్ హోటలా.. అన్న భ్రమ కలగక మానదు. కానీ, సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇంటిని చూస్తే అంతకు మించి అనాల్సి వస్తుంది. మురళీ మోహన్ గారి అబ్బాయి, జయభేరీ అధినేత రామ్మోహన్ ప్రత్యేక శ్రద్ధతో కట్టించిన ఆ ఇంటిపేరు ‘రాగమ్’.
ఆ ఇళ్లు ఇంధ్ర భవనంలా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రెంచ్ ఆర్కిటెక్ట్ ఆనంద్ దాన్ని డిజైన్ చేశారు. తాతోస్ అనే గ్రీస్ మార్బల్‌తో ఇంటిని నిర్మించారు. తాజ్‌మహాల్ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఇళ్లు ఉంటుంది. మొత్తం రెండు ఫ్లోర్ల భవనం అది. ఇళ్లు కట్టి 15 సంవత్సరాలు అవుతున్నా.. నిన్న కట్టిన దానిలా ఉంటుంది. ఓ వైపు బండ్ల గణేష్ ఇళ్లు. మరో వైపు కోడి రామకృష్ణ ఇళ్లు ఉంటాయి. మరి, మురళి మోహన్ ఇంటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రభాస్ – ప్రశాంత్ నీల్.. సలార్ టీజర్ పై క్రేజీ అప్ డేట్..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి