డాన్సింగ్ క్వీన్ పుట్టిన రోజు నేడు !!

భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. ‘ఏక్ దో తీన్’ పాటతో దేశాన్ని ఉర్రూతలూపి, సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అందాల నటి మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. నేటితో 48వ వసంతంలోకి అడుగుపెట్టిన మాధురి తన జన్మదిన వేడుకలను కుటుంబసభ్యులతో కలసి జరుపుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని చెప్పింది. గత సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమైనదని తాను స్థాపించిన ఆన్ లైన్ డ్యాన్సింగ్ అకాడమీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని ఈ సందర్భంగా తెలిపింది. అందరికీ డ్యాన్స్ మెలకువలందించడమే తన లక్ష్యమని మాధురి చెప్పింది.

madhuri dixit 12001984లో ‘అబోద్’ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాధురీ. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కానీ.. మాధురీకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత మాధురీ ‘అవారా బాప్’, ‘స్వాతి’, ‘మానవ్ కిల్లింగ్’, ‘నార్త్ సౌత్’ సహా పలు చిత్రాల్లో నటించిది. ఇందులో ఏ సినిమా కూడా విజయం సాధించలేకపోయాయి. కానీ తర్వాత విడుదలైన ‘తేజాబ్’ సినిమా మాధురీ కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పింది. 1988 విడుదలైన తేజాబ్ సినిమాలో మాధురీ మోహిన్ పాత్రలో ఆకట్టుకుంది. ఇందులోని ఏక్, దో, తీన్ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మాధురీ – రామ్ లఖన్, ప్రేమ్ ప్రతిజ్ఞ, త్రిదేవ్ సినిమాల్లో నటించింది. 1990 లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన “దిల్” అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించింది. ఇందులో ఆమె ఒక డబ్బున్న పొగరుగత్తె అమ్మాయి అయిన మధు మెహ్రా పాత్రలో మెప్పించింది.   అంతే కాకుండా దీక్షిత్ కు ఆమె సినీ జీవితపు మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. 1999 అక్టోబర్ 17న మాధురీ యూఎస్ సర్జన్ శ్రీరామ్ మాధవ్ నేనే ను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని మాధురి అన్నయ్య ఇంటిలో ఈ వేడుక జరిగింది. మాధురికి ఇద్దరు కుమారులు.. ఆరిన్ నేనే, ర్యాన్ నేనే ఉన్నారు.