
మనం ఆరోగ్యం గురించి ఏ విధంగా జాగ్రత్త పడతామో, అదే విధంగా జుట్టు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం. అయితే కొందరు మాత్రం తమ జుట్టుకు ఇచ్చే ప్రాధాన్యత మరే ఇతర విషయంలో కూడా ఇవ్వరు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా చాలా మంది ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇక ఈ క్రమంలో చాలా మంది కేవలం జుట్టు మొదళ్లపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో కురుల చివర్లో చిట్లిపోతుంటాయి. దీంతో ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోతుంది.
ఇలా జుట్టు ఎక్కువగా రాలే వారు పోషకాహారం తీసుకోవడంతో పాటు జుట్టు రాలే సమస్యలపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఈ జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఆలివ్ ఆయిల్ వినియోగం ఎంతో సత్ఫలితాలను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మాడుని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టు రాలకుండా చేస్తుంది. అంతేగాక జుట్టు పెరిగేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
కాగా వారానికి రెండు లేదా మూడుసార్లు ఆలివ్ ఆయిల్ మాడుకు రాసి మర్దనా చేస్తే, ఫాలికల్స్ ఉత్తేజవంతంగా మారి జుట్టు తిరిగి వస్తుంది. ఇక జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉండేందుకు నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్, చెంచాడు బాదం నూనె, కొద్దిగా కర్పూరం తీసుకుని బాగా కలపాలి. మాడు నుండి జుట్టు చివర్ల వరకు ఇది మర్ధనా చేస్తే జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. అందుకే కేవలం, మాడుపైనే కాకుండా జుట్టు చివర్లు కూడా బలంగా ఉంటేనే ఆ జుట్టు అందంగా కనిపిస్తుంది.