అన్నిదానాల్లో కన్నా మిన్న అవయవదానం!..

జీవన్‌దాన్!… అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది. బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.

బ్రెయిన్‌డెడ్‌ అయిన దాతల నుంచి అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు మార్పిడి నిర్వహించడంలో జీవనదాన్‌ కీలకపాత్ర పోషిస్తోంది.  ఇప్పటి వరకు ఆ సంస్థ ప్రతినిధులు 3,100 అవయవాలను మార్పిడి చేసి బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారు. ఈ సంస్థ ఇక్కడే కాదు ఇతర రాష్ర్టాలు, దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాలు, విమానాలలో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడిల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.

ఏదైనా బ్రెయిన్‌డెత్‌ ఉంటే జీవన్‌దాన్‌కు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి ఓ కో-ఆర్డినేటర్‌ వెళ్లి రోగి కుటుంబసభ్యులను ఒప్పించి అవయవ మార్పిడి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తారు. ఆ తరువాత ఆ వివరాలను వెంటనే జీవన్‌దాన్‌ కమిటీకి అందజేస్తారు. ఆ కమిటీ అత్యవసరంగా అవయవాలు అవసరమున్న బాధితులను గుర్తించి మార్పిడికి అవకాశం ఇస్తుంది. జాబితా ప్రకారం అత్యవసరమున్న వారికే ఈ అవయవాలను అందించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

అవయవాలు అవసరమైన బాధితులు ముందుగా జీవన్‌దాన్‌ నోడల్‌ కేంద్రానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి. సమాచారం కోసం 040-23489494 కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.  jeevandan.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు