Home టాప్ స్టోరీస్ విడాకుల బాధ నుండి భయటపడడం ఎలా?

విడాకుల బాధ నుండి భయటపడడం ఎలా?

divorce couples gettyimages

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది మరుపురాని క్షణం. అయితే ఆ తర్వాత ఏర్పడే కొన్ని పరిస్థితులు మరియు అంతర్గత కలహాల కారణంగా విడాకులకు దారితీయవచ్చు. ఇటువంటి సమయంలో తీవ్ర మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. అది మెంటల్ గా మాత్రమే కాకుండా ఫిజికల్ పెయిన్ కూడా కలిగిస్తుంది. అసలు విడాకుల సమయంలో మన మైండ్ స్టేట్ ఎలా ఉంటుంది ? విడాకుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? విడాకుల తర్వాత సంతోషంగా  జీవించాలంటే ఎం చెయ్యాలనే ప్రశ్నలకి జవాబులను ఇప్పుడు తెలుసుకుందాం…

రియాలిటీ :

విడాకులు తీసుకున్న అనేక మంది వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. తనను మోసంచేశారని, మానసికంగా హింసించారని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇదే నిజం. మీరు ఇప్పుడు విడాకులు తీసుకున్నారు, మునుపటిలా మీ జీవితం ఉండదన్నది నిజం. మీ చుట్టూ ఉండే పరిస్థితులు మారుతాయని మీరు గ్రహించాలి. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను గమనించి వాటిని ఆమోదించాలి. మీరు రియాలిటీలోకి రాకపోయినట్టయితే మీ పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది.

నెగిటివ్ ఫిలింగ్స్ :

ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేని సమయంలో మన బ్రెయిన్ అబ్నార్మల్ గా బిహేవియర్ చేస్తుంది. మన భావాలూ, మనల్ని నియంతిర్నచడానికి ప్రయత్నిస్తాయి. విడాకులకు కారణం మీరేనని అనిపించవచ్చ, మీ తప్పులు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మీ మనస్సు చెప్తుంది. ముఖ్యంగా అవతలివాళ్ళకి అనుగుణంగా మారితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చేమో అని అనిపిస్తుంది. ఈ నెగిటివ్ ఫిలింగ్స్ అన్నింటిని మీ మనుసు నుండి తీసేయండి. లేకపోతే మీరు మరింత కృంగిపోయే అవకాశం ఉంది. చాలామందికి డివోర్స్ ఒక పెద్ద భూకంపం లాంటిది. అందులోని మీరు ప్రేమ వివాహం చేసుకుంటే,  ఈ బాధ మిమ్మల్ని మరింత కృంగదీసే  అవకాశం ఉంది. 

ఫిజికల్ చేంజెస్ :

విడాకుల సమయంలో ఏర్పడే తీవ్ర మానసిక ఒత్తిడి భౌతికమైన మార్పులకు కారణం అవుతుంది. ఇది ఎక్సట్రనల్ గా ఇన్ సొమ్నియా మరియు అనోరెక్సియా నెర్వోసా వంటి వ్యాధులకు కారణం అవుతుంది. ఈ రెండు వ్యాధులు తీవ్రమైన నిద్రలేమి మరియు ఆకలి లేకపోవడం వంటి వాటిని కలిగిస్తాయి.దీనితో మీ శరీరం బరువును కోల్పోతుంది. తీవ్రమైన ఒత్తడి మీ మెదడు పై ప్రభావాన్ని చూపి, కంటి చూపును నాశనం చేయవచ్చు. నిద్రలేమి కారణంగా బీపీలో మార్పులకు దారి తీసి హార్ట్ ఎటాక్ కు కారణం అవుతుంది.

విడాకుల తరవాత సంతోషంగా ఉండాలంటే ఎం చెయ్యాలి ?

లైఫ్ లో వచ్చే సర్వసాధారణమైన సమస్యల్లో విడాకుల మరియు  ప్రేమ ఒకటనని గుర్తించుకోండి.అది జీవితానికి ముగింపో లేక ప్రారంభంమే కాదు. అందుకే ఈ విషయం గురించి ఎక్కువ భాధపడవలిసిన అవసరం లేదు. మీ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసం ప్రయత్నించండి తద్వారా మీరు  ఈ బాధ నుండి బయట పడే అవకాశం ఉంది .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad