Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము మంచి నీళ్లు తాగండి, వందేళ్లు బ్రతకండి: వాటర్ ఫార్ములా

మంచి నీళ్లు తాగండి, వందేళ్లు బ్రతకండి: వాటర్ ఫార్ములా

purified drinking water

మానవ శరీరం 60 శాతం మంచి నీళ్లుతో నిండి ఉంటుంది. జీవక్రియలో ద్రవాలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే నీళ్లు తాగడం అన్నది అత్యవసరం. నీళ్లతో దాహం తీరడంతో పాటు కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ అవుతుంది. మంచి నీళ్ళు అధికంగా తీసుకున్న వ్యక్తుల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు 12 నుండి 13 గ్లాసులో నీళ్ళు తాగాలి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ మంది నీళ్లు కంటే సాఫ్ట్ డ్రింక్స్ పై ఆధార పడుతున్నారు. అయితే అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. నీరు త్రాగడం వలన అనేక ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయి. నీళ్లలో ఎటువంటి క్యాలరీలు ఉండవు. అందుకే శీతలపానీయాలు కంటే నీరు త్రాగడం చాలా మంచిది. 

ప్రయోజనాలు :

  • నీళ్లు అధికంగా తాగడం ద్వారా మలబద్దకం నుండి బయటపడవచ్చు. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం ద్వారా మూత్రపిండాలు క్లీన్ అవుతాయి. తాజా అధ్యయనాల ప్రకారం ఎక్కువగా నీరు తీసుకున్న వారు కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదయం పూట నీళ్లు తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలి.
  • సౌందర్యాన్ని కాపాడే సాధనాలలో నీరుకు అధిక ప్రాధాన్యత ఉంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీని వలన చర్మం ముడతలు పడటం, మొటిమలు వంటి చర్మ సంబంధ వ్యాధులు రావచ్చు. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ప్రతిరోజు మంచినీరు త్రాగడం వల్ల చర్మం మరియు చర్మ రంద్రాల ను క్లీన్ చేసి కొమలమైన సౌందర్యాని అందిస్తుంది మరియు చర్మాని మృదువుగా,తేమగా ఉంచుతుంది. 
  • బరువు తగ్గిద్దాం అనుకున్నవారికి నీరు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీరు తాగడం ద్వారా జీవక్రియల వేగం పెరుగుతుంది. ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి బరువు తగ్గేటట్టు చేస్తోంది. భోజనానికి ముందు నీరు తాగడం ద్వారా తక్కువ ఆహారం తీసుకోవచ్చు. 
  • అధికంగా నీరు తీసుకునే వారిలో తల నొప్పి సమస్యలు తక్కువగా ఉంటాయి. మెదడు పని చేయడానికి ఆక్సిజన్ తో పాటు గ్లూకోజ్ కూడా చాలా అవసరం. నీటిలో ఉండే గ్లూకోజ్ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు అధికంగా నీరు తీసుకోవాలి. 
  •  ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి నీరు తీసుకోవడం ద్వారా ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. నీళ్లు అధిక యాసిడ్స్, ఆమ్లాలు రాకుండా నియంత్రించడంతో పాటు కడుపులో మంటను తగ్గిస్తుంది.  
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad