Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము శానిటైజర్ అతిగా వాడితే అనర్థాలే..

శానిటైజర్ అతిగా వాడితే అనర్థాలే..

Hand Sanitizer

దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో జనం జాగ్రత్తలు వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖానికి మాస్కులు, శానిటైజర్ వాడుతున్నారు. దీంతో వీటికి మార్కెట్లో మంచి గిరాకీ వచ్చింది. ముఖ్యంగా శానిటైజర్ లు కొనేందుకు పోటీ పడుతున్నారు. కుదిరినప్పుడల్లా ఎగాదిగా రాసేస్తున్నారు. చేతులకూ కాళ్ళకూ కొంతమంది అయితే ముఖాలకు కూడా రాసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విచ్చలవిడిగా వాడుతున్నారు. కానీ ఇలా చేయడం అంత శ్రేయస్కరం కాదు.

శరీరంలో రెండు రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఒకటి మంచి బ్యాక్టీరియా రెండోది చెడు బ్యాక్టీరియా. మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువగా శానిటైజర్ వాడటం వల్ల మన అరిచేతుల్లో ని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. అది జరిగితే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అంతేకాదు తరుచూ శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్ కు అలవాటు పడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఆ తర్వాత మనం శానిటైజర్ తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుంది.

కాబట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. సబ్బు నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ వాడడానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల పాటు చేతులు కడుక్కుంటే క్రిముల్ని తరిమికొట్టొచ్చు అని పరిశోధన సంస్థ తెలిపింది. మీ చేతులకూ విపరీతంగా దుమ్ము, ధూళి అంటుకున్నప్పుడు కూడా ఉపయోగించకూడదు. చేతులు ఎక్కువగా అశుభ్రంగా ఉన్నప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లు ఇక అపరిశుభ్రతను సృష్టిస్తాయి.

అంతే కాదు క్రిముల్ని చంపడం లోనూ విఫలమవుతాయి. చుట్టుపక్కల ఉన్న వారు తుమ్మినా దగ్గినా కొంత మంది వెంటనే శానిటైజర్ రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఈ లాభం ఉండదు. గాలిలోని క్రిములను శానిటైజర్ చంపలేదని గుర్తించాలి. అన్నింటికీ మించి శానిటైజర్ లను పిల్లలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని శరీరంలోకి తీసుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

విశాఖ‌లో మ‌రో ప్ర‌మాదం…చేప‌ల బోటులో మంట‌లు

విశాఖను వ‌రుస ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగింది. ఓ చేపలబోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...
- Advertisement -